24 గంటలు... దర్శన సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడం, పది, ఇంటర్మీడియట్ ఫలితాలు రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2023-05-13 02:32 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడం, పది, ఇంటర్మీడియట్ ఫలితాలు రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్‌లోకి వచ్చిన నడకదారి భక్తులకు మాత్రం ఐదు గంటల్లో స్వామి వారి దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. కాకపోతే ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్‌లో ప్రవేశించిన భక్తులు మాత్రం శ్రీవారి దర్శనం 24 గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం రెండు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,763 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 3,5,399 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News