Andhra Pradesh : ఏపీలో ఎన్టీఆర్ వైద్యసేవలు ప్రారంభం
ఎన్టీఆర్ వైద్య సేవలు ఆంధ్రప్రదేశ్ లో తిరిగి ప్రారంభమయ్యాయి
ఎన్టీఆర్ వైద్య సేవలు ఆంధ్రప్రదేశ్ లో తిరిగి ప్రారంభమయ్యాయి. నెట్‍వర్క్ ఆస్పత్రులతో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలం అయ్యాయి. ఈ నెల 10వ తేదీన తమకు చెల్లించాల్సిన బకాయీలను వెంటనే విడుదల చేయాలని నెట్ వర్క్ ఆసుపత్రులన్నీ ఎన్టీఆర్ వైద్య సేవలను బంద్ చేశాయి. తమకు చెల్లించాల్సిన 2,800 కోట్ల బకాయీలను వెంటనే విడుదల చేయాలన్నది వారి డిమాండ్.
నిధుల విడుదలకు...
అయితే ప్రభుత్వం తో చర్చలు జరిపిన తర్వాత సఫలం కావడంతో నెట్‍వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సమ్మె విరమించాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పది రోజుల్లో రూ.670 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వత మరో 15 రోజుల్లో మిగిలిన బకాయిలు చెల్లిస్తామన్న ఏపీ ప్రభుత్వం చెప్పడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి.