ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. మండిపడుతున్న బీజేపీ నేతలు !

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గిలో తెలుగుజాతి గర్వించదగిన మహానాయకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై

Update: 2022-01-03 08:25 GMT

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గిలో తెలుగుజాతి గర్వించదగిన మహానాయకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు స్పందించారు. అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీఎం రమేశ్ తెలిపారు. ఇందుకు కారణమైన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. గతేడాది దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం.. ఇప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడును అభిమానించి, పల్నాడు పౌరుషాన్ని తెరకెక్కించిన మహానటుడి విగ్రహాన్ని పడగొట్టాలనుకోవడం బాధాకరమైన విషయమన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.


Tags:    

Similar News