BJP : నేడు బీజేపీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్
నేడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల కానుంది
నేడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల కానుంది. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుల నియామకం కోసం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ ప్రకటించారు. 29వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ మరియు ఓటర్ లిస్ట్ ప్రచురణ ఉండనుంది. 30వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
జులై 1న అధ్యక్షుడి పేరు ప్రకటన...
జులై 1వ తేదీ నుంచి 2 వ తేదీవరకు నామినేషన్లను పరిశీలిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకూ నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. జులై ఒకటో తేదీన ఉదయం పదకొండు గంటలకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటిస్తారు. ఇందుకోసం ఓటర్ల జాబితాను కూడా విడుదల చేశారు.