జగన్ కోర్టుకు రావాల్సిందే

కోడికత్తి కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయస్థానంలో జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని ఎన్‌ఐఏ కోర్టు తెలిపింది.

Update: 2023-01-31 11:38 GMT

కోడికత్తి కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయస్థానంలో జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని ఎన్‌ఐఏ కోర్టు తెలిపింది. ఈరోజు కోడికత్తి కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి విచారణకు జగన్ హాజరు కావాల్సిందేనని పేర్కొంది. ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశఆఖ ఎయిర్‌పోర్టు కమాండెంట్ రాఘవ విచారణకు హాజరు కాకపోవడంతో కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్ ను కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

షెడ్యూల్ లో...
షెడ్యూల్ లో బాధితుడు ఎప్పుడు వచ్చేది కూడా ఉండాలని న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసులో బాధితుడు ముఖ్యమంత్రి జగన్ కావడంతో ఆయనకు సంబంధించిన షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏ ను న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను న్యాయమూర్తి ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా వేశారు. ఫిబ్రవరి 15న విచారణకు జగన్ కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.


Tags:    

Similar News