తిరుమలకు వెళ్తున్నారా.. ఈ విషయం తెలుసుకోండి!!

తిరుమలకు భక్తులు పోటెత్తుతూ ఉండడంతో కొండపై విపరీతమైన

Update: 2024-05-24 10:33 GMT

తిరుమలకు భక్తులు పోటెత్తుతూ ఉండడంతో కొండపై విపరీతమైన రద్దీ నెలకొంటోంది. స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో సుమారు 30-40 గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు త్వరిత గతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఆయా రోజులకు సంబంధించి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 14 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం నాడు 65,416 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లు అని టీటీడీ తెలిపింది.


Tags:    

Similar News