ఏనుగుల కోసం తిరుపతిలో కొత్త ప్రయోగం
తిరుపతిలో అటవీశాఖాధికారుల కొత్త ప్రయోగం చేపట్టారు. ఏనుగుల ముందస్తు సమాచారం కోసం ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు
తిరుపతిలో అటవీశాఖాధికారుల కొత్త ప్రయోగం చేపట్టారు. ఏనుగుల ముందస్తు సమాచారం కోసం ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. పంట పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా అనేక మంది ప్రాణాలను కూడా ఇటీవల కాలంలో పోగొట్టుకున్నారు.
ముందుగా అలెర్ట్ చేసి...
మరొక వైపు ఏనుగుల గుంపును చెదరగొట్టడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కు కుంకీ ఏనుగులను తీసుకు వచ్చే ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని గ్రామాల్లో ఇంకా ఏనుగులు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఏనుగుల కదలికలపై ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేయనున్నారు. గ్రామాల్లోకి ఏనుగులు సమీపిస్తున్న సమయంలో ఎలిఫెంట్ టాస్క్‌ఫోర్స్ అలర్ట్ మెసేజ్‌లు పంపనున్నారు.