Nellore Politics : నెల్లూరోళ్లు.. నీలుగుతున్నారుగా.. ఇక దబడి దిబిడేనా?

నెల్లూరు రాజకీయాలు పదహారు నెలల్లోనే మారాయి. టీడీపీలో గ్రూపు విభేదాలు భగ్గుమంటున్నాయి

Update: 2025-10-21 08:45 GMT

నెల్లూరు రాజకీయాలు పదహారు నెలల్లోనే మారాయి. టీడీపీలో గ్రూపు విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీ కట్టుబాటు తప్పి నేతలు వ్యవహరిస్తున్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో నేతల తీరుతో ఉన్న నియోజకవర్గాలన్నీ వైసీపీకి సమర్పించుకుంటారన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాల్లో కూటమి పార్టీ నేతల్లో వారికి వారికి పొసగడం లేదు. జనసేనలోనూ అంతే. టీడీపీలోనూ అలాగే ఉంది. మంత్రి పదవి దక్కలేదని కొందరు ఇప్పటికే నేతలు అసంతృప్తిగా ఉండగా, మరికొందరు నామినేటెడ్ పదవులు తమకు దక్కలేదన్న భావనతో పార్టీ కార్యక్రమాలకే కాకుండా పార్టీని నష్టపర్చే విధంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది.

టీడీపీలోనూ గ్రూపులు...
తెలుగుదేశం పార్టీలో పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం యాక్టివ్ గా కనిపించడం లేదు. అలాగే ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని సీనియర్ నేతలు గుస్సాగా ఉన్నారు. బయటకు కనిపించకపోయినప్పటికీ ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతూనే ఉన్నారు. కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పౌరసరఫరాల శాఖ పై హార్ష్ కామెంట్స్ చేశారు. రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి తమిళనాడుకు సరఫరా చేస్తున్నాడంటూ ఆయన ఆరోపించారు. రేషన్ బియ్యం పాలిట మాఫియా డాన్ గా మారిన ఈ టీడీపీ నేత ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోరారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ నేతల్లో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయి టీడీపీలోనూ చర్చనీయాంశమైంది. అయితే టీడీపీ నాయకత్వం సెట్ చేసినట్లు కనిపించినా అది అప్పటికే పార్టీని డ్యామేజీ చేసిందనే చెప్పాలి.
జనసేన నేత అజయ్...
జనసేన నేత వేముల పాటి అజయ్ కుమార్ కు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిడ్కో ఛైర్మన్ గా నియమించారు. ఆయన జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు కూడా సన్నిహితులు. అలాంటి అజయ్ కుమార్ పదవి చేపట్టిన తర్వాత నెల్లూరు జనసేన నేతలకు విలన్ గా మారారు. వారినే లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులకు సన్నిహితంగా మారారన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో నెల్లూరు జనసేన నేతలు ఎక్కువ మంది ఇటీవల పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన నెల్లూరు జిల్లా అజయ్ బాధిత నేతలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి భరోసా ఇచ్చారు. వేముల పాటి అజయ్ కు కూడా పవన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశానికి అజయ్ ను కూడా రమ్మనకుండా వారు చేసిన ఫిర్యాదులు విన్న పవన్ వేముల పాటి అజయ్ పై సీరియస్ అయినట్లు సమాచారం. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో టీడీపీ, జనసేనలో విభేదాలు జిల్లాలో రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.


Tags:    

Similar News