Breaking : తిరుమల లడ్డూ కల్లీ పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది

Update: 2026-03-13 06:05 GMT

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. లడ్డూలో జంతువులు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా? అని ప్రశ్నించింది. పిటీషనర్ వద్ద ఏదైనా ఆధారాలుంటే సీబీఐకి అందించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత కొద్ది రోజుల నుంచి తిరుమల లడ్డూ వివాదం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూనే ఉంది.

మీరేమైనా నిపుణులా?
ఈ ప్రచారంపై పిటీషన్ దాఖలయింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఈ కేసుకు సంబంధించి గతంలోనే విచారణ జరిపింది. సీబీఐకి ఏదైనా ఆధారాలుంటే ఇవ్వాలి కానీ, ఇలా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరెవ్వరు అని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించింది.


Tags:    

Similar News