హత్య కుట్ర వెనక ఉన్నదెవరో చెప్పాల్సిందే : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
తనపై హత్యాప్రయత్నం జరిగిందన్న వీడియో వైరల్ కావడంపై నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు
తనపై హత్యాప్రయత్నం జరిగిందన్న వీడియో వైరల్ కావడంపై నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వారు మాట్లాడుకున్న వారికి ఎవరు అండగా ఉన్నారన్న విషయాన్ని, తనను చంపితే ఎవరు డబ్బు ఇస్తారన్న దానిపై పోలీసులు విచారణ జరపాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఎవరి బెదిరింపులకు...
తాను ఎవరి బెదిరింపులకు లొంగే వాడిని కాదని, తాను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ భయపడే వ్యక్తులం కాదని తెలిపారు. ప్రజల కోసం ప్రాణాలిచ్చే చరిత్ర తమదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రౌడీషీటర్లు మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అయిన మూడు రోజుల వరకూ తనకు పోలీసులు ఎందుకు తెలియజేయలేని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కుట్ర వెనక ఎవరున్నారన్నది సమాజానికి తెలియపర్చాలని ఆయన డిమాండ్ చేశారు.