Chandrababu : గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఇక వరసగా నగదు వారి ఖాతాల్లో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 12న లక్షమందికిపైగా వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి తేదీలతో త్వరలో క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం, దీపం పథకం ఇచ్చే మూడు సిలిండర్లకు సంబంధించి ముందుగానే నగదును లబ్దిదారుల ఖాతాలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.
బుక్ చేసుకోవడానితో సంబంధం లేకుండా...
సిలిండర్ బుక్ చేసుకున్నారా? లేదా? అన్నది సంబంధం లేకుండా ముందుగానే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. ప్రతి నెలకు ఒక సంక్షేమ పథకం అమలు చేసేలా క్యాలెండర్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. సంవత్సరానికి క్యాలెండర్ ను విడుదల చేస్తారు. 2014 - 2019 మధ్య కాలంలో ఉపాధి హామీ, నీరు చెట్టు కింద పనులు చేపట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు లోపు పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.