పింఛన్ల పంపిణీలో సీఎస్ లెక్క చేయడంలేదు

అమరావతి లోని సచివాలయంలో చీఫ్ సెక్రటరీ ఛాంబర్ వద్ద ఎన్డీయే కూటమి నేతలు ధర్నా చేశారు

Update: 2024-04-27 11:46 GMT

అమరావతి లోని సచివాలయంలో చీఫ్ సెక్రటరీ ఛాంబర్ వద్ద ఎన్డీయే కూటమి నేతలు ధర్నా చేశారు. ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయాలని ధర్నాకు దిగారు. మే 1వ తేదీన ఇంటి వద్దకే పింఛను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‍కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పింఛన్ కోసం వచ్చిన వృద్ధులు గత నెలలో ప్రాణాలు కోల్పోయారన్నారు

ఈసీ చెప్పినా...
ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఉత్తర్వులిచ్చినా చీఫ్ సెక్రటరీ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారుక. పింఛన్ కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని చీఫ్ సెక్రటరీని కోరామని, అయినా సీఎస్ మా విన్నపాన్ని లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. మే లో పింఛన్ పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా అందుకు సీఎస్‍దే బాధ్యత అని చెప్పారు.


Tags:    

Similar News