Andhra Pradesh : నేటి నుంచి తిరుపతిలో మహిళ సాధికార కమిటీల జాతీయ సదస్సు
మహిళ సాధికార కమిటీల జాతీయ సదస్సు నేటి నుంచి తిరుపతిలో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా హాజరు కానున్నారు.
మహిళ సాధికార కమిటీల జాతీయ సదస్సు నేటి నుంచి తిరుపతిలో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా హాజరు కానున్నారు. చట్టసభల్లో ఉండే మహిళ సభ్యులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. తిరుపతిలోని తిరుచానూరు సమీపంలో ఉన్న రాహుల్ కన్వెన్షన్ లో ఈ సదస్సు జరగనుంది. తొలిరోజు అంటే ఈరోజు జరిగే సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.
రెండు రోజుల సదస్సులో...
లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్, శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజులు రెండు రోజుల సదస్సులో పాల్గొంటారు. అనేక అంశాలపై చర్చించి ఈ సదస్సులో తీర్మానాలు చేయనున్నారు. అనేక అంశాలపై చర్చించనున్నారు. చట్టసభల్లో మహిళల పాత్రతో పాటు మరింతగా మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు అవసరమైన వాటిపై చర్చించనున్నారు.