శ్రీశైలాన్నిదర్శించుకున్న నాలుగో ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలోని భ్రమరాంబికామల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు.

Update: 2025-10-16 06:52 GMT

ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలోని భ్రమరాంబికామల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు నుంచి హెలికాప్టర్ లో సుండిపెంటకు ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రధాని మోదీ చేరుకున్నారు. హెలికాప్టర్ లో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. సుండిపెంట నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకున్న ప్రధాని మోదీ కాసేపు భ్రమరాంబ అతిధిగృహంలో విశ్రాంతి తీసుకున్నారు.

ఇప్పటి వరకూ...
అనంతరం ఆలయానికి వచ్చారు. ఆలయం వద్ద వేదమంత్రాలతో అర్చకులు ప్రధానికి స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం మల్లికార్జున స్వామి వారికి పంచామృత అభిషేకం చేశారు. అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందించారు. అక్కడి నుంచి నేరుగా శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్లి కాసేపు ధ్యానం చేస్తారు. ఇప్పటి వరకూ శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ముగ్గురు ప్రధానులు మాత్రమే దర్శించుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహరావులు ఈ క్షేత్రానికి వచ్చారు. నాలుగో ప్రధానిగా నరేంద్ర మోదీ శ్రీశైలం వచ్చారు.


Tags:    

Similar News