Narendra Modi : ప్రధాని మోదీ ఏపీ నేటి షెడ్యూల్ ఇదే
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన సాగనుంది. ఈరోజు ఉదయం 7.20 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో బయలుదేరి 9.50 గంటలు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా 10.55 గంటలకు హెలికాప్టర్ ద్వారా శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అనంతరం భ్రమరాంబ గెస్ట్ హౌస్ లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
అనంతరం శ్రీశైలం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం వివిధ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం కర్నూలులో జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో రోడ్ షో లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు. అనంతరం 4.20 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.