Kurnool Bus Accident : ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు అందచేస్తామని తెలిపారు.
గాయపడిన వారికి...
గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కర్నూలులో జరిగిన హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రయివేటు బస్సులో మంటలు అంటుకోవడంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించారు. ఇప్పటి వరకూ పన్నెండు మృతదేహాలను బయటకు తీశారు. ఫోరెన్సిక్ బృందం ఘటన వద్దనే పరీక్షలు నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించే ప్రక్రియ చేపట్టారు.