Posani Krishna Murali : నరసరావుపేటకు పోసాని

సినీ నటుడు పోసాని కృష్ణమురళి కి నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Update: 2025-03-03 04:13 GMT

సినీ నటుడు పోసాని కృష్ణమురళి కి నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్ తో రాజంపేట సబ్ జైలుకు వచ్చిన నరసరావుపేట పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నరసరావుపేటకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై పది హేడు కేసుల వరకూ నమోదయ్యాయయ్యాయని పోలీసులు తెలిపారు.

పదిహేడు కేసులు...
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులు నమోదయ్యాయి. దీంతో ఓబులాపల్లె పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసానిని పీటీ వారెంట్ పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణమురళిపై 153-ఎ, 504, 67 ఐటీ కింద కేసు నమోదు అయినట్లు తెలిపారు.


Tags:    

Similar News