Nara Lokesh : కడప మాస్ జాతర అదిరింది.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే

వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. కడప మహానాడులో లోకేశ్ మాట్లాడారు

Update: 2025-05-29 11:43 GMT

వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. కడప మహానాడులో లోకేశ్ మాట్లాడారు. దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చేశారు, ఒక్క కొత్త కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయన్నారు. అంతులేని ధనదాహంతో విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని ఏరులై పారించి ముప్ఫయి వేలమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారన్నారు. వేలకోట్లు దోచుకొని రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వెళ్లిపోయారని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదని, ప్రతిపక్షం కొత్త కాదు. కానీ 2019 నుండి 2024 వరకూ విధ్వంస పాలన ఎదుర్కొన్నామని, ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే అరెస్ట్. మన అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారన్నారు. నాయకులు, కార్యకర్తల పై వేల కేసులు, అరెస్టులు జరిగాయి. నాయకులు, కార్యకర్తల పై దాడులు చేశారన్న లోకేశ్ హత్యలు చేశారన్నారు.

అడ్రస్ లేకుండా పోయారని...
కడప మాస్ జాతర మహానాడు అదిరిపోయిందన్న లోకేశ్ పౌరుషాల గడ్డపై పసుపు సైన్యం గర్జించిందన్నారు. దేవుని గడప కడపలో పసుపు పండగ జరుపుకోవడం మన అదృష్టమన్న లోకేశ్ 2024లో మాస్ విక్టరీ సాధించాం, రికార్డులు బద్దలు కొట్టామన్నా చరిత్రను తిరగరాశామన్నారు లోకేశ్. 164 అవుటాఫ్ 175. ఇది కేవలం రికార్డ్ కాదు ఆల్ టైం రికార్డ్. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటుదెబ్బ. జెండా పీకేస్తాం అన్నారని, పార్టీ కార్యాలయానికి టు లెట్ బోర్డు పెట్టుకున్నారాన్నారు. పార్టీ లేకుండా చేస్తామన్నోళ్లు అడ్రెస్స్ లేకుండా పోయారన్న లోకేశ్ వై నాట్ 175 అన్నారని, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని లోకేశ్ ధ్వజమెట్టారు.1982 బ్యాచ్ సీనియర్ నాయకుల దగ్గర నుండి 2025 బ్యాచ్ జూనియర్లకు, ప్రజలకు, అందరి కంటే ముఖ్యం, ఎత్తిన జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్నప్రాణసమానమైన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు.
ఆరుశాసనాలే మన శ్వాస...
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్నారు అన్న ఎన్టీఆర్. అందుకే మనం ఆరుశాసనాలు తీసుకున్నామన్న లోకేశ్, కడప మహానాడులో ఏకగ్రీవంగా ఆమోదించిన ఆరుశాసనాలను పొలిట్ బ్యూరో సభ్యుడి నుంచి సామాన్య కార్యకర్త వరకు శ్వాసగా భావించి చిత్తశుద్ధితో అమలుకు కృషిచేయాలి. 1). తెలుగుజాతి - విశ్వఖ్యాతి, పేదలసేవలో – రీఇంజనీరింగ్, స్త్రీశక్తి,, యువగళం, అన్నదాతకు అండగ, కార్యకర్తే అధినేత. మనకు రాష్ట్రప్రజలు, ప్రజల ముఖాల్లో చిరునవ్వు, వారి సంతోషమే ముఖ్యం. ఇందుకోసం అహర్నిశలు కష్టపడి ప్రజల మనసు గెలుద్దాం. సమస్యలుంటే ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించుకోవాలి. స్థానికంగా సాధ్యం కాకపోతే మా దృష్టికి తీసుకువస్తే మేమే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. రాజమండ్రి జైలులో చంద్రబాబును చూసినపుడు చాలా బాధేసింది. అలిపిరిలో ఆయనను చంపేందుకు బాంబు పేల్చారు. ప్రజలకు అండగా నిలచేందుకు భగవంతుడు ఆయనను ఈనాడు మన ముందుంచారన్నారు లోకేశ్. తెలుగు వారిని ప్రపంచ పటంలో పెట్టింది మన బ్రాండ్ సీబీఎన్ అని, అప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ. అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ. అప్పుడు సైబరాబాద్ ఇప్పుడు అమరావతి అని లోకేశ్ అన్నారు.


Tags:    

Similar News