Nara Lokesh :నారా లోకేష్ పేరిట ఘరానా మోసం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేరుతో భారీ సైబర్ క్రైమ్ కు నిందితులు పాల్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేరుతో భారీ సైబర్ క్రైమ్ కు నిందితులు పాల్పడ్డారు. అయితే వారిని వెంటనే గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి నారా లోకేశ్ పేరు చెప్పి 54 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన దుండగులు లోకేష్ పేరు చెప్పి దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
సైబర్ నేరగాళ్లను...
దీంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు సాయిశ్రీనాథ్, సుమంత్ ను అదుపులోకి తీసుకున్నారు. వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా, నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. గతంలో ఏ1 రాజేష్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.