Nara Bhuvaneswari : లండన్ లో నారా భువనేశ్వరికి అవార్డు ప్రదానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి లండన్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి లండన్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకున్నారు. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు -2025కు లండన్ లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో భువనేశ్వరి తీసుకున్నారు. లండన్ లోని గ్లోబల్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు.
హెరిటేజ్ ఫుడ్స్ కు ...
హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు సంబంధించిన ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించి గోల్డెన్ పీకాక్ అవార్డునూ సంస్థ ప్రతినిధులు నారా భువనేశ్వరికి ఈ సందర్భంగా ప్రదానం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ - సామాజిక సాధికారత రంగాల్లో చేసిన కృషికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును సంస్థ ప్రతినిధులు నారా భువనేశ్వరికి అందచేశారరు.