Andhra Pradesh : కుప్పంలో నారా భువనేశ్వరి
కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి మూడో రోజు పర్యటన కొనసాగుతుంది
కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈరోజు నారా భువనేశ్వరి మహిళలతో కలిసి ఉచిత బస్సు ప్రయాణం చేయనున్నారు. నారా భువనేశ్వరి గత మూడు రోజుల నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలతో సమావేశమవుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
మూడు రోజుల నుంచి...
నారా భువనేశ్వరికి తమ సమస్యలను చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు వస్తున్నారు. వారి నుంచి ఓపిగ్గా వినతి పత్రాలను స్వీకరించి తాను ప్రభుత్వానికి అందచేస్తానని హామీ ఇస్తున్నారు. ఈరోజు నారా భువనేశ్వరి తుమ్మిసి పెద్ద చెరువు, విజలాపురంలో ఏర్పాటు చేసిన జల హారతి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శాంతిపురం, బలరామకుప్పం, అనిగనూరు రామకుప్పం మహిళలతో నారా భువనేశ్వరి సమావేశం కానున్నారు.