ఆ డైలాగులు ఉండాల్సినవే

వీరసింహారెడ్డి సినిమాలో డైలాగులపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. జరుగుతున్న పరిస్థితులనే సినిమాలో చూపించామన్నారు

Update: 2023-01-14 12:54 GMT

వీరసింహారెడ్డి సినిమాలో డైలాగులపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. జరుగుతున్న పరిస్థితులనే సినిమాలో చూపించామన్నారు. ప్రజల అభిమానాలను ఎవరూ అడ్డుకోలేరన్నారు. రాష్ట్రంలో ఎమెర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. ప్రజల్లో నానుతున్న అంశాలనే సినిమాలో డైలాగులుగా చెప్పామన్నారు. వీర సింహారెడ్డి ఫ్యాక్షన్ సినిమా కాదని బాలయ్య చెప్పారు.

ఎమెర్జెన్సీ పరిస్థితులు....
అటువంటి డైలాగులు రా‌ష్ట్రానికి అవసరమని అన్నారు. ఒక ఎమ్మెల్యేగా, ఒక తెలుగువాడిా తాను చెబుతున్నానని రాష్ట్రంలో పరిస్థితులు బాగా లేవన్నారు. ఆ పరిస్థితులకు అనుగుణంగానే తాము సినిమాలను తీస్తామని, అందుకే జనాలు ఆదరిస్తున్నారని బాలకృష్ణ అన్నారు. వీరసింహారెడ్డి సిినిమాలో జగన్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న డైలాగులపై అధికార పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News