కారంచేడులో భోగి మంటలు వేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఈసారి భోగి పండగను ప్రకాశం జిల్లా కారంచేడులో జరుపుకున్నారు.

Update: 2022-01-14 03:23 GMT

నందమూరి బాలకృష్ణ ఈసారి భోగి పండగను ప్రకాశం జిల్లా కారంచేడులో జరుపుకున్నారు. తన సోదరి పురంద్రీశ్వరి అత్తగారి ఊరు అయిన కారంచేడులో జరిగిన భోగి వేడుకల్లో నందమూరి బాలకృష్ణ దంపతులు పాల్గొన్నారు. ప్రతి సంక్రాంతికి బాలకృష్ణ తన బావ చంద్రబాబు సొంత ఊరు అయిన నారా వారి పల్లె వెళతారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ జరిగే వేడుకల్లో బాలకృష్ణ పాల్గొనే వారు.

సోదరి కుటుంబ సభ్యులతో.....
ఈసారి నందమూరి బాలకృష్ణ తన సోదరి పురంద్రేశ్వరి నివాసంలో ఆయన భోగిపండగను జరుపుకున్నారు. భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తెలుగు ప్రజలకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు.


Tags:    

Similar News