Andhra Pradesh : ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. తమ సమస్యలను పరిష్కరిచాలని కోరుతూ వారు ఆందోళనకు దిగారు. ఈరోజు తాడేపల్లిలోని డీఎంఏ కార్యాలయాన్ని ముట్టడికి మున్సిపల్ కార్మికుల సంఘం పిలుపు నిచ్చింది. ఈరోజు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ డీఎంఏ ఆఫీస్ ఎదుట మున్సిపల్ కార్మికుల నిరసన తెలియజేయనున్నారు.
డీఎంఏ కార్యాలయాన్ని ముట్టడికి...
జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారు. మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగడంతో చెత్త పేరుకుపోయిందని, దుర్గంధం నెలకొందని ప్రజలు ఆందోళనచెందుతున్నారు. దోమల బెడద కూడా ఎక్కువయిందని అంటున్నారు. మరోవైపుడీఎంఏ కార్యాలయం ముట్టడికి పిలుపు నివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.