గుంటూరులో మరో మూడు అన్నా కాంటిన్లు
గుంటూరులో కొత్తగా మూడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి నగరపాలక సంస్థ నిర్ణయించింది
గుంటూరులో కొత్తగా మూడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి నగరపాలక సంస్థ నిర్ణయించింది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గల అరండల్ పేట పిచ్చుకలగుంట ప్రాంతం, ఆటోనగర్, రైల్వే స్టేషన్లలో మరో మూడు అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం స్థలపరిశీలన చేయనున్నారు.
ఇప్పటికే ఉన్న వాటితో...
ఇప్పటికే గుంటూరులోని ఆర్టీసీ బస్టాండ్, పల్నాడు బస్టాండ్, నల్లచెరువు, మిర్చియార్డు, చుట్టుగుంట, ఐడీ హాస్పిటల్ వద్ద, ఆర్టీవో కార్యాలయం వద్ద అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు మరింతగా సేవలందించేందుకు ఇంకా మూడు కాంటిన్లను గుంటూరు నగరపాలక సంస్థ పరిథిలో తెరవాలని . కమిషనర్ పులి శ్రీనివాసులు నిర్ణయించారు.