Andhra Pradesh : కల్తీ మద్యం .. ఖజానాకు చిల్లు
తంబళ్లపల్లి ములకనూరు మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ ఖజానాపై కూడా పడింది.
తంబళ్లపల్లి ములకనూరు మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ ఖజానాపై కూడా పడింది. నకిలీ మద్యం వార్తలతో వినియోగం రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. తాము కొనుగోలు చేసే మద్యం నకిలీదని భావించి కొనుగోలుకు ముందుకు రావడం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఫలితంగా వైన్ షాపుల్లోనూ, బార్లలోనూ కొనుగోళ్లు తగ్గాయని చెప్పింది.
కల్తీ మద్యం భయంతో...
కల్తీ మద్యం భయంతో ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ ఆదాయం భారీగా పడిపోయింది. రోజుకు సగటున .78 నుంచి 80 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రానుంది. కల్తీ నకిలీ భయంతో గణనీయంగా తగ్గింది. వినియోగదారులు మద్యం కొనుగోలుకు వెనుకాడటంతో మద్యం దుకాణాల వద్ద రద్దీ తగ్గింది. దీంతో ప్రభుత్వం ఆదాయ లోటుతో సతమతమవుతోంది. ఎక్సైజ్ శాఖ నకిలీ లిక్కర్ నెట్ వర్క్ ను గుర్తించేందుకు తనిఖీలు ముమ్మరం చేసి, ఐదుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే