చంద్రబాబు, పవన్ ఓటమికి తాను పనిచేస్తా : ముద్రగడ

చంద్రబాబు, పవన్ ఓటమి కోసం తాను పని చేస్తానని ముద్రగడ పద్మనాభం తెలిపారు.

Update: 2024-03-24 12:00 GMT

ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా పార్టీ పెడితే తాను వెళ్లాలా అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. చిరంజీవి ఓడిపోయాకరని, పవన్ రెండు చోట్ల ఓడిపోయారని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం వలన తాను నష్టపోయానని ముద్రగడ చెప్పుకొచ్చారు. తన శత్రవులతో పవన్ కళ్యాణ్ ఎలా కలుస్తారని ముద్రగడ ప్రశ్నించారు.

ఎందుకు సపోర్టు చేయలి?
పిఠాపురంలో పవన్ కల్యాణ్ కచ్చితంగా ఓడిపోతాడని ముద్రగడ జోస్యం చెప్పారు. కాపుల కోసం పవన్ ఇప్పుడు ఉద్యమం చేయవచ్చు కదా ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. చంద్రబాబు తనను చాలా ఇబ్బందులు పెట్టాడని, జగన్కు.. పవన్కు చాలా తేడా ఉందని అన్నారు. 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉంటారుని, 20 సీట్ల కోసం పవన్కు తాను ఎందుకు సపోర్ట్ చేయాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ ఓటమి కోసం తాను పని చేస్తానని ముద్రగడ పద్మనాభం తెలిపారు.


Tags:    

Similar News