బ్లూ ప్రింట్ రెడీ చేయండి....వారికి ముద్రగడ లేఖ

దళిత, బీసీ, కాపులకు మాజీ పార్లమెంటు సభ్యుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.

Update: 2022-01-04 04:48 GMT

దళిత, బీసీ, కాపులకు మాజీ పార్లమెంటు సభ్యుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అధికారం వేరే వారికి అప్పగించాలా? అని ప్రశ్నించారు. తక్కువ జనాభా ఉన్న వారికి మనం పల్లకిని మోయాలా? అని ప్రశ్నించారు. హడావిడి, ఆర్భాటాలు లేకుండా రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలన్నారు. దళితులను, బీసీలను, కాపులను గడ్డిపోచల్లా చూస్తున్నారన్నారని ముద్రగడ పద్మనాభం తెలిపారు.

అందరూ కలసి....
దళితులు, బీసీలు, కాపులు కలసి రాజ్యాధికారం కోసం బ్లూప్రింట్ ను సిద్ధం చేయాలని ముద్రగడ పద్మనాభం తన లేఖలో కోరారు. మన అవసరం తీరాక పశువులకన్నా హీనంగా చూస్తున్నారన్నారు. రాజకీయాల్లో సమూల మార్పుల కోసం ప్రయత్నించాలన్నారు. ఈ రాష్ట్రం ఎవరి జాగీరు కాదన్నారు. అందరూ కలసి సముచితమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇటీవల కాపు నేతల సమావేశం తర్వాత ముద్రగడ పద్మనాభం ఈ లేఖను విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News