పిల్లాడిని భుజాల మీద మోస్తున్న ఈయన ఎవరో తెలుసా..?

Update: 2022-10-12 11:36 GMT

అనంతపురం, సత్యసాయి జిల్లాలో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో జలమయమయ్యాయి . రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రుద్రంపేట, విశ్వశాంతినగర్, చంద్రబాబు కొట్టాల గౌరవ్ రెసిడెన్సీ కాలనీలు నీటమునిగాయి. శివారు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఆలమూరు చెరువు గట్టు తెగిపోవడంతో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. మంగళవారం రాత్రి నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అనంతపురం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. వరద నీటితో అనంతపురం నగరంలోని రుద్రంపేట, నడిమివంక, ఆదర్శ్‌నగర్‌ కాలనీలు జలమయమయ్యాయి. అధికారులు దాదాపు 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రంగస్వామయి నగర్‌లో చిక్కుకున్న కాలనీవాసులను బోట్ల సాయంతో రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వారిని ఎంపీ గోరంట్ల మాధవ్ స్వయంగా రక్షించారు. జాకీర్ కొట్టాల ప్రాంతంలో వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న బాలున్ని మోసుకుంటూ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు ఎంపీ గోరంట్ల మాధవ్. ఆయన ఓ పిల్లాడిని తన భుజాల మీద మోసుకుంటూ తీసుకుని వచ్చిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Tags:    

Similar News