Montha Cyclone : ప్రమాద హెచ్చరికల స్థాయి పెరిగిందిగా
మొంథా తుపాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశముంది. దీంతో కాకినాడ పోర్టు వద్ద పదో నెంబరు హెచ్చరిక జారీ అయింది
మొంథా తుపాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశముంది. దీంతో కాకినాడ పోర్టు వద్ద పదో నెంబరు హెచ్చరిక జారీ అయింది. మొంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేసిన వాతావరణ శాఖ ఇప్పటికే అనేక జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కాకినాడ తీరం వద్ద ఈరోజు సాయంత్రానికి కాని, రాత్రికి కాని తీరం దాటే అవకాశముందని చెప్పింది.
కాకినాడ పోర్టు వద్ద...
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పోర్టుల వద్ద ప్రమాద హెచ్చరికల స్థాయిని వాతావరణ కేంద్రం పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ పోర్టు వద్ద పదో నెంబరు, విశాఖపట్నం, గంగవరం పోర్టు వద్ద తొమ్మిదో నెంబరు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపోర్టుల వద్ద ఎనిమిదో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం వెంట బలమైన గాలులు వీస్తాయని ముందస్తు హెచ్చరించాయి.