ఏపీలో స్కూళ్లలో నో మొబైల్ ఫోన్స్

పాఠశాలల్లో ఫోన్ల వాడకంపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా

Update: 2023-08-28 09:41 GMT

పాఠశాలల్లో ఫోన్ల వాడకంపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూల్స్ లో ఫోన్ల వాడకంపై విద్యాశాఖ నిషేధం విధించింది. చాలా పాఠశాలల్లో విద్యార్థులు రహస్యంగా మొబైల్ ఫోన్లు వాడుతూ ఉండడంతో విద్యార్థులు స్కూళ్లకు మొబైల్స్ తీసుకుని రాకుండా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. టీచర్లు సైతం తరగతి గదుల్లోకి ఫోన్లు తీసుకుని రాకూడదని విద్యాశాఖ సూచించింది. క్లాస్‌లోకి వెళ్లే ముందే హెడ్ మాస్టర్ దగ్గర ఫోన్‌ను ఉంచాలని, ఆ తర్వాతే పాఠాలు చెప్పేందుకు వెళ్లాలంటూ సరికొత్త నిబంధన విధించింది.

బోధనకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులు చూడాలని ఆదేశించింది. టీచర్లు క్లాసులు చెప్పే సమయంలో వచ్చిన ఫోన్ కాల్స్‌ను ఎత్తి మాట్లాడటం వల్ల విద్యార్థులకు నష్టం చేకూరుతుంది. టీచర్‌తోపాటు ఇటు విద్యార్థులు కూడా పాఠంపై పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టాలంటే మొబైల్ ఫోన్స్ బ్యాన్ చేయాలని అన్నారు. స్కూల్ హెడ్మాస్టర్లు, ఆ పై స్థాయి అధికారులు మొబైల్ ఫోన్ నిబంధనను కచ్చితంగ పాటించాలని సూచించింది.


Tags:    

Similar News