Nara Lokesh : నేడు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో లోకేశ్
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం లభించింది
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం లభించింది. ఒంగోలు వద్ద మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు టంగుటూరు టోల్ గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. కందుకూరు నియోజకవర్గం తెట్టు వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు.
మాలేపాటి సుబ్బనాయుడు కుటుంబాన్ని...
భారీ గజమాలతో మంత్రి లోకేష్ కు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పార్టీ జెండాలు, పుష్పగుచ్ఛాలు, జై తెలుగుదేశం నినాదాలతో మంత్రి లోకేష్ కు స్వాగతం చెప్పారు. మరికాసేపట్లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తిలో రాష్ట్ర ఆగ్రోస్ కార్పోరేషన్ ఛైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు నివాసానికి మంత్రి లోకేష్ వెళ్లనున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.