అంబటి సవాల్ పై అనగాని రెస్పాన్స్

మాజీ మంత్రి అంబటి రాంబాబు సవాల్ పై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Update: 2025-08-25 07:39 GMT

మాజీ మంత్రి అంబటి రాంబాబు సవాల్ పై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. చంద్రబాబుకు అంబటి సవాల్ చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పోలవరంపై చర్చకు తాము సిద్ధమన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ అంబటికి దమ్ముంటే చర్చకు రావాలంటూ ఛాలెంజ్ విసిరారు. అనవసర ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు.

పోలవరం ప్రాజెక్టుపై...
జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్ట్ ను వరదల్లో ముంచారన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ రివర్స్ టెండరింగ్ పేరుతో విధ్వంసం చేశారన్నారు. దమ్ముంటే వీటిపై చర్చకు రావాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు భయపడుతున్నారంటూ అంబటి కామెంట్స్ విడ్డూరంగా ఉందని, ఎవరు ఎవరిని చూసి భయపడుతున్నారో అందరికీ తెలుసునని అన్నారు.


Tags:    

Similar News