ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి

Update: 2023-03-13 02:48 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఐదు స్థానాల్లో విపక్షాలు గట్టిగా పోరాడుతున్నాయి. మూడు ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతుండటంతో దాదాపు వందకు పైగా శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ జరగనుంది.

బ్యాలట్ విధానంలో...
ఇందుకోసం బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. అలాగే తెలంగాణలో ఒక టీచర్, ఒక స్థానిక సంస్థల ఎన్నిక ప్రారంభమయింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ స్థానం ఎంఐఎంకు అధికార టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.


Tags:    

Similar News