జగన్ సొంతపార్టీ నేతలనే రాప్పా రప్పా చేస్తారు

వ్యవసాయశాఖను వైసీపీ నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు

Update: 2025-07-20 06:44 GMT

వ్యవసాయశాఖను వైసీపీ నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. జగన్‌కి కిలో, క్వింటాకు తేడా తెలుసా అని యరపతినేని ప్రశ్నించారు. గంజాయిసాగు తప్ప వ్యవసాయం గురించి జగన్‌కు తెలియదన్న యరపతినేని శ్రీనివాసరావు ఐఏఎస్, ఐపీఎస్ లను జగన్‌ జైలుకు పంపారన్నారు. తాను అధికారంలోకి వస్తానిని జగన్ కలలు కంటున్నారన్నారు.

రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారని...
వైసీపీ నేతలు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారన్న యరపతినేని శ్రీనివాసరావు సొంత పార్టీ నేతలనే జగన్‌ రప్పా రప్పా చేస్తారని తెలిపారు. వైసీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలంటూ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నేతలను అలెర్ట్ చేశారు. వైఎస్ జగన్ కలలు ఎప్పటికీ నెరవేరవన్న యరపతినేని తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.


Tags:    

Similar News