మంత్రి విడదల రజిని ఆఫీస్‌పై దాడి
గుంటూరులో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విద్యానగర్‌లోని ఏపీ
Minister vidadala rajini office attacked by tdp janasena in guntur
గుంటూరులో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విద్యానగర్‌లోని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని నూతన పార్టీ ఆఫీస్‌పై టీడీపీ-జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. కొంతమంది టీడీపీ-జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉండగా.. మంత్రి విడుదల రజిని కార్యాలయం పక్కనే అర్ధరాత్రి దాటాక టీడీపీ, జనసేన శ్రేణులు రాత్రిపూట ర్యాలీ తీశారు. కార్యాలయం సమీపంలో ఎన్టీఆర్ విగ్రహానికి కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. పాలాభిషేకం అనంతరం టీడీపీ, జనసేన కార్యకర్తల గుంపులోని కొందరు కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. దాంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ, జనసేన శ్రేణులను లాఠీ ఛార్జ్ చేసి చదరగొట్టారు. ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా మంత్రి విడదల రజిని నియమితులయ్యారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని నూతన కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. ఇంతలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మంత్రి కార్యాలయం వద్దకు వచ్చి పరిశీలించారు.