ట్వంటీ ట్వంటీ ఫోర్... జగనన్న వన్స్ మోర్

రాయలసీమ గడ్డ మీద పుట్టిన తాను ఉత్తరాంధ్రకు మద్దతి స్తున్నానంటే జగన్ అజెండా ఎంత గట్టిదో ఆలోచించాలని మంత్రి రోజా అన్నారు

Update: 2022-10-15 07:19 GMT

రాయలసీమ గడ్డ మీద పుట్టిన నేను ఉత్తరాంధ్రకు మద్దతు ఇస్తున్నానంటే జగన్ అజెండా ఎంత గట్టిదో ఆలోచించాలని మంత్రి ఆర్కే రోజా అన్నారు. హైదరాబాద్ లాగా మరోసారి ఇక్కడ ఉద్యమాలు రాకూడదని మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువస్తే, ఈ పెయిడ్ ఆర్టిస్టులు యాత్ర చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ కు పెళ్లిచేసుకోవడానికి, నటన నేర్చుకోవడానికి, ఎన్నికలలో గెలవడానికి విశాఖ కావాలి కాని, రాజధాని మాత్రం విశాఖకు వద్దంటున్నారు. అత్యాశ కోసం రైతులు ఈరోజు పోరాటం చేస్తున్నారన్నారు.

వలసల నుంచి...
వలసల నుంచి విముక్తి పొందడానికి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఈరోజు లక్షలాది మంది ప్రజలు గర్జనకు తరలి వచ్చారన్నారు. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేయకుండా చేసేందుకు చంద్రబాబు చేసే కుట్రను ఎదుర్కొనాలని రోజా పిలుపు నిచ్చారు. 26 జిల్లాల్లో రైతులు, ప్రజలు ఉన్నారని, అందరికీ సమానంగా అభివృద్ధి అందాలని జగన్ చూస్తున్నారని, చంద్రబాబు మాత్రం 29 గ్రామాల కోసమే పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబుకు పవన్ బినామీ అని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలని రోజా పిలుపునిచ్చారు. 2024 జగనన్న వన్స్ మోర్ అని నినాదాలు చేశారు.


Tags:    

Similar News