ప్రశాంత్ కిషోర్ భేటీ గురించి వైసీపీ అలా అనుకుంటోంది!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్

Update: 2023-12-23 14:44 GMT

Minister Rambabu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం 3 గంటల పాటు సాగింది. ఈ భేటీపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడు? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 2019లో ఎన్నికలకు ముందు ‘బీహారీ దొంగ’ అని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై చంద్రబాబు నిందలు వేసిన సంగతిని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఓట్లు తొలగిస్తున్నారు.. నా ఓటు కూడా తీసేస్తారేమో అంటూ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే! ఆ విషయాన్ని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా టీమ్ హైలెట్ చేస్తూ ఉంది.

మంత్రి అంబటి మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవటం ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. గతంలో పీకేపై చంద్రబాబు, నారా లోకేష్‌ చేసిన విమర్శలు గుర్తు చేసుకోవాలన్నారు. చంద్రబాబు, లోకేస్‌ దిగజారుడు తనానికి ఇది నిదర్శనమని.. ప్రశాంత్‌ కిషోర్‌ను డెకాయిట్‌ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎంత మంది ప్రశాంత్‌ కిషోర్‌లు.. పవన్‌ కల్యాణ్‌లు వచ్చినా టీడీపీని బతికించే అవకాశం లేదన్నారు. టీడీపీకి ప్రాణం పోయడానికి ప్రశాంత్‌ కిషోర్‌ పనికిరాడని.. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు, లోకేష్‌ ఎలా దిగజారుతారో గుర్తుచేసుకోండన్నారు. అసరమైతే వీరిద్దరూ ఎవరి కాళ్లైనా పట్టుకుంటారు.. మెటీరియల్‌ మంచిది కాకపోతే మేస్త్రీ ఏమీ చేయలేడన్నారు. ఇది తెలుగు దేశం కార్యకర్తలు గమనించాలి. ప్రశాంత్‌ కిషోర్‌ టీడీపీని పోస్టుమార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు. రాబిన్‌ సింగ్‌ పని అయిపోయింది. అందుకే కొత్త వ్యూహకర్తను రంగంలోకి దింపారు. వ్యూహకర్తలు మారినంత మాత్రాన ఉపయోగం లేదన్నారు అంబటి.


Full View


Tags:    

Similar News