వర్మకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆయన కౌంటర్ గా ట్వీట్ కేశారు.

Update: 2022-01-05 03:21 GMT

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆయన కౌంటర్ గా ట్వీట్ కేశారు. హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ కు ఒక ఫార్ములా చెప్పారని, అయితే మీరు ఏ హీరోకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు? ఎంత సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు? అన్న దానిని పరిగణనలోకి టిక్కెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించదని మంత్రి పేర్ని నాని ట్వీట్ చేశారు.

బ్లాక్ మార్కెటింగ్ కాదా?
ధియేటర్లలో ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా ప్రభుత్వం టిక్కెట్ల ధరలను నిర్ణయిస్తుందని మంత్రి నాని తెలిపారు. 1970 సినిమాటోగ్రఫీ చట్టంలో నిబంధనలు చెబుతున్నాయన్నారు. ఒక్కొక్క టిక్కెట్ వంద టిక్కెట్ ను వెయ్యికి, రెండు వేలకు అమ్మడం ఏంటన్నారు. దీనిని ఏ మార్కెట్ మెకానిజం చెప్పిందన్నారు. టిక్కెట్లు రేట్లు పెంచి అమ్ముకోవడం డిమాండ్ సప్లయ్ అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? అన్నది చెప్పాలని పేర్ని నాని రాంగోపాల్ వర్మను ప్రశ్నించారు.


Tags:    

Similar News