ముగిసిన నారాయణ దుబాయ్ పర్యటన
దుబాయ్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన ముగిసింది.
దుబాయ్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన ముగిసింది. మూడు రోజులపాటు దుబాయ్‌లో పర్యటించిన మంత్రి నారాయణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు హాజరై ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని నారాయణ కోరారు.
పెట్టుబడుల కోసం...
మంత్రి నారాయణ బృందం బీయా ఫెసిలిటీ, కార్బోనాటిక్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి భేటీ అయింది. టెక్టాన్ ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయింది. రాష్ట్రంలో పెట్టుబడులకు కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించిన నారాయణకు సానుకూల స్పందన పారిశ్రామికవేత్తల నుంచి లభించిందని చెబుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచిన దుబాయ్ కంపెనీలను ఈనెల 14, 15 తేదీల్లో విశాఖలో సదస్సుకుమంత్రి నారాయణ ఆహ్వానించారు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న నారాయణ నేడు అమరావతి చేరుకుంటారు.