మే 2న అమరావతిలో ప్రధాని రోడ్ షో
రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి తో కలిసి ప్రధాని సభకు వచ్చే రోడ్లు పరిశీలించిన మంత్రి నారాయణ సభా వేదిక వద్దకు చేరుకునే రోడ్లు,పార్కింగ్ ప్రాంతాలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో 64 వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచామని, వచ్చే నెల 2 న రాజధాని పనులు ప్రధాని చేతుల మీదుగా రీ లాంచ్ జరుగుతుందని చెప్పారు. వచ్చే నెల 2 న ప్రధాని సాయంత్రం 4 నుంచి 5 గంటలవరకు బహిరంగ సభలో పాల్గొంటారని, ఐదు లక్షల మంది ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
రోడ్ల నిర్మాణంపై...
రాజధాని లో కొన్ని రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, పోలీసు శాఖ సమన్వయం తో సీఆర్డీఏ సిబ్బంది తో కలిసి రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్న నారాయణ మొత్తం పదకొండు పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంగళగిరి,తాడికొండ, హరిశ్చంద్రపురం, ప్రకాశం బ్యారేజి,వెస్ట్ బైపాస్ మీదుగా సభకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని,ప్రధాని హెలిప్యాడ్ నుంచి సెక్యూరిటి సూచనల ప్రకారం కిలోమీటర్ మేర రోడ్ షో ఉంటుందని తెలిపారు.