ఏపీలో పురుషులకు స్వయం సహాయక సంఘాలు ఎక్కడంటే?
ఆంధ్రప్రదేశ్ లో పురుషులకు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు
ఆంధ్రప్రదేశ్ లో పురుషులకు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. పురుషులకు స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై అసెంబ్లీలో మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పురుషులకు స్వయం సహాయక సంఘాల గ్రూపులున్నాయన్న మంత్రి నారాయణ మహిళా గ్రూపులకు ఉన్న తరహాలోనే పురుషులకు కూడా స్వయం సహాయక సంఘాల విధివిధానాలు రూపొందించినట్లు తెలిపారు. దేశంలోని 25 నగరాల్లో మహిళలతో పాటు సమానంగా పురుషులకు కూడా కేంద్రం వర్తింపచేస్తుందని తెలిపారు.
విజయవాడ, విశాఖలలో...
ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ,విశాఖలో పురుషులకు స్వయం సహాయక సంఘాలున్నాయన్న మంత్రి నారాయణ ఏప్రిల్ 2025 నాటకి అన్ని నగరాల్లో వర్తింపచేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోందని తెలిపారు. బలహీన వర్గాల పురుషులకు మాత్రమే ఈ గ్రూపులున్నాయని, విశాఖ,విజయవాడలో ఇప్పటివరకూ 818 గ్రూపులు ఏర్పాటయ్యాయన్న మంత్రి నారాయణ దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో 1949 మాత్రమే చేస్తే ఏపీలో కేవలం రెండు నగరాల్లోనే 818 గ్రూపులు ఏర్పాటుచేశామని నారాయణ తెలిపారు.