రాజధాని నిర్మాణంపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చిన నారాయణ

రాజ‌ధాని నిర్మాణానికి 64,721.48 కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ తెలిపారు

Update: 2025-03-11 06:37 GMT

రాజ‌ధాని నిర్మాణానికి 64,721.48 కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. అసెంబ్లీ ఈ వివరాలను వెల్లడించారు. మూడేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేస్తామన్న నారాయణ అమ‌రావ‌తి గ‌వ‌ర్న‌మెంట్ కాంప్లెక్స్లో ఇళ్లు,భ‌వ‌న నిర్మాణాలు,ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్,ఎల్పీఎస్ మౌళిక స‌దుపాయాల అభివృద్ది కోసం 64,721.48 కోట్లు ఖ‌ర్చ‌వుతుందని చెప్పారు.ఈ నిధుల‌ను వివిధ రూపాల్లో సేక‌రించి అమ‌రావ‌తి నిర్మాణం చేప‌డుతున్నామని, బ‌హుళ ప‌క్ష ఏజెన్సీలు,బ్యాంకుల నుండి లోన్ లు,కేంద్ర ప్ర‌భుత్వం నుండి గ్రాంటుల‌ను పొందడం ద్వారా నిధుల సేక‌ర‌ణ‌ జరుపుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రైతుల‌కు అభివృద్ది చేసిన ప్లాట్ల‌ను ద‌శ‌ల వారీగా మూడేళ్ల‌లో అప్ప‌గించేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉందన్న నారాయణ 2019-24 మ‌ధ్య విధాన‌ప‌ర‌మైన అనిశ్చితుల కార‌ణంగా ఈ ప్ర‌క్రియ‌లో జాప్యం జ‌రిగిందని, ప్ర‌పంచ‌లో టాప్ 5 లో ఒక‌టిగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు రాజ‌ధానిని డిజైన్ చేసారని తెలిపారు. కానీ శాడిజంతో శాడిజంతో క‌క్ష సాధింపుతో ఆర్ - 5 జోన్ చేసి జగన్ 50 వేల మందికి ఒక సెంట్ భూమి ఇచ్చారన్నారు.

రుణాలు తీసుకుని...
వారికి కూడా ప్ర‌త్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని, న్యాయం చేస్తామనితెలిపారు. రాజ‌ధానికి వ‌ర‌ల్డ్ బ్యాంకు,ఏడీబీ బ్యాంకు క‌లిపి 13,400 కోట్లు లోన్ ఇస్తున్నాయని, కే. ఎఫ్.డబ్ల్యూ బ్యాంకు 5 వేల కోట్లు లోన్ ఇస్తుందని చెప్పారు. హ‌డ్కో నుంచి 11000 కోట్లు రుణం రెండు మూడు రోజుల్లో వ‌స్తుంది..కేంద్రం గ్రాంట్ కింద 1560 కోట్లు ఇస్తుందని నారాయణ వివరించారు. భూములు అమ్మ‌డం ద్వారా,అలాగే జాతీయ,అంత‌ర్జాతీయ మార్కెట్ లో త‌క్కువ వ‌డ్డీకి లోన్ తీసుకోవ‌డం ద్వారా మిగిలిన నిధులు స‌మీక‌రిస్తామని మంత్రి తెలిపారు. అమ‌రావ‌తిలో 106 ప్ర‌భుత్వ‌,ప్ర‌భుత్వేత‌ర‌ రంగ సంస్థ‌లు త‌మ కార్యాల‌యాలు ఏర్పాటుచేసేందుకు సిద్దంగా ఉన్నాయని, అమ‌రావ‌తిలో మెయిన్ రోడ్లు 165 అడుగులు,185 అడుగుల‌తో రెండేళ్ల‌లో పూర్తి చేస్తాం...ఎల్పీఎస్ రోడ్లు మూడేళ్ల‌లో పూర్తి చేస్తామని తెలిపారు. సగానికి పైగా నిర్మాణం జ‌రిగిన అధికారుల భ‌వ‌నాలు ఏడాదిన్న‌ర‌లో...మిగ‌తావి రెండేళ్లు,అసెంబ్లీ,సెక్ర‌టేరియ‌ట్,హైకోర్టు నిర్మాణాన్ని మూడేళ్ల‌లో పూర్తి చేస్తామని చెప్పారు.


Tags:    

Similar News