శ్రీకాకుళం లో డయేరియా పై మంత్రి నారాయణ సమీక్ష

శ్రీకాకుళం లో డయేరియా పరిస్థితి పై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు

Update: 2026-02-25 04:18 GMT

శ్రీకాకుళం లో డయేరియా పరిస్థితి పై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్,మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి నారాయణ పారిశుద్ధ్యం మెరుగుదల కోసం అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ట్యాంకర్ల ద్వారా...
డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదనపు సిబ్బంది తో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని ఆదేశించిన మంత్రి నారాయణ, బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, తాగునీరు కలుషితం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News