Ys Jagan : నేడు నందిపల్లెలో జగన్ పర్యటన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన కొనసాగుతుంది

Update: 2026-02-25 04:12 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన కొనసాగుతుంది. నేడు నందిపల్లెలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. స్థానిక శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠలో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ఉదయం పదిన్నర గంటలకు వేంపల్లి మండలం నందిపల్లి నందీశ్వర ఆలయాన్ని వైఎస్ జగన్ దర్శించుకోనున్నారు.

ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు...
నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న అనంతరం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో జరగనున్న హోమంలో కూడా జగన్ పాల్గొననునున్నారు. వైఎస్ జగన్ ఈ ఆలయానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1.8 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. మధ్యాహ్నం నుంచి పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ను నిర్వహించనున్నారు.


Tags:    

Similar News