ఈమె తల్లేనా? వివాహేతర సంబంధం కోసం చిన్నారిని చిదిమేసిందిగా?
తిరుపతిలో చిన్నారి దుర్గ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు
తిరుపతిలో చిన్నారి దుర్గ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. రెండు రోజుల క్రితం తిరుపతి బ్లిస్ కూడలి సమీపంలో అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. అనుమానంతో చిన్నారి తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు విచారించారు. కుమార్తె దుర్గను ప్రియుడు రెడ్డి కుమార్‌తో కలిసి ఆశాలత హతమార్చినట్లు గుర్తించారు. చిన్నారిని స్వర్ణముఖి నదిలో మృతదేహాన్ని పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తల్లి ఆశాలత, ఆమె ప్రియుడు రెడ్డికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు.
స్వర్ణముఖి నదిలో పూడ్చిపెట్టినట్లు...
చిన్నారి మృతదేహాన్ని పాపనాయుడుపేట వద్ద స్వర్ణముఖి నదిలో పూడ్చిపెట్టినట్లు గుర్తించిన పోలీసులు మృతదేహం వెలికితీతకు సహకరించాలని ఏర్పేడు తహసీల్దార్‌ను తిరుపతి పోలీసులు కోరారు. చిన్నారి దుర్గను తల్లి, ఆమె ప్రియుడే హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. రెండు రోజుల క్రితం తిరుపతి బ్లిస్ కూడలి సమీపంలో అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. కుమార్తె అదృశ్యమైనట్లు పోలీసులకు దుర్గ తల్లి ఆశాలత ఫిర్యాదు చేశారు. అనుమానంతో చిన్నారి తల్లి, ఆమె ప్రియుడిని విచారించిన పోలీసులు, కుమార్తె దుర్గను ప్రియుడు రెడ్డికుమార్‌తో కలిసి ఆశాలత హతమార్చినట్లు గుర్తించారు. తల్లి ఆశాలత, ఆమె ప్రియుడు రెడ్డికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.