ప్రాణాలు పోతే కానీ స్పందించరా?

రాజమండ్రిలో పాల కల్తీ జరిగిన తర్వాత మాత్రమే అధికారుల స్పందిస్తారు

Update: 2026-02-25 07:15 GMT

రాజమండ్రిలో పాల కల్తీ జరిగిన తర్వాత మాత్రమే అధికారుల స్పందిస్తారు. పాలు కల్తీ జరిగి ఐదుగురు మరణించిన తర్వాత ఫుడ్ సేప్టీ అధికారులు ఇప్పుడు సోదాలు, దాడులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు అంతా అధికారులు ఎక్కడికి వెళ్లారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫుడ్ సేఫ్టే అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ కల్తీల విషయంపై ఆరా తీయాలని, అలా నిర్లక్ష్యం వహించడం వల్లనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంఘటన తర్వాత మాత్రమే...
సంఘటన జరిగిన తర్వాత కానీ వీరు అప్రమత్తం కారు. అప్పుడు తనిఖీలు చేస్తుంటారు. ఏశాఖలోనైనా అంతే. ఇలా చేయడం వల్ల ప్రాణాలు గాలిలో కలసి పోవడం ఆగుతాయా? అన్న ప్రశ్నకు మాత్రం వీరివద్ద సమాధానం లేదు. ఇప్పుడు కూడా రాష్ట్రమంతటా కాదు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ప్రయివేటు డెయిరీల్లోనే ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. మిగిలిన చోట్ల కూడా ఇటువంటి తనిఖీలు ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News