రాజధాని అమరావతి వాసులకు గుడ్ న్యూస్
అమరావతి ప్రాంత ప్రజలకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు.
అమరావతి ప్రాంత ప్రజలకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతి పనులను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యుద్ధప్రాతిపదికపై వాటిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన పనులు ఈ నెల 12 నుంచి 15వ తేదీ మధ్య పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.
త్వరలోనే ముహూర్తం...
నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. నిర్మాణ పనులకు సంబంధించి త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందన్న మంత్రి నారాయణ, మొదటి దశలో 40 వేల కోట్లు పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారని ప్రశ్నించిన మంత్రి రాజధానిపై మీ స్టాండ్ చెప్పమంటే బొత్స తర్వాత చెప్తాను అంటున్నారని, గత ప్రభుత్వంలో మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారంటూ ఎద్దేవా చేశారు.