Nara Lokesh : నేడు ఎమ్మెల్సీ ఎన్నికలపై లోకేశ్

మంత్రి నారా లోకేశ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు

Update: 2025-02-24 03:33 GMT

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంగా కూటమి నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ప్రచారంలో ముందున్న కూటమినేతలు సమన్వయంతో ముందుకు వెళ్లేలా పార్టీల అధినాయకత్వాలు ఇప్పటికే నేతలను ఆదేశించారు.

27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. నేడు మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి నారా లోకేశ్ భేటీ కానున్నారు. 27న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో లోకేష్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయంతో పనిచేసేలా లోకేష్ దిశానిర్దేశం చేయనున్నారు.


Tags:    

Similar News