Nara Lokesh : వైసీపీ నేతలకు లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్
తిరుమల శ్రీవారి సన్నిధిలో వైసీపీ కుట్రలు చేస్తోందంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు
తిరుమల శ్రీవారి సన్నిధిలో వైసీపీ కుట్రలు చేస్తోందంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడి సన్నిధిలో వైసీపీ కుట్రలకు పాల్పడుతుందన్నారు. దర్శన కంపార్ట్ మెంట్‍లో వైసీపీ నేత అచ్చారావు నిరసన వ్యక్తం చేశారని లోకేశ్ తెలిపారు. పథకం ప్రకారం అచ్చారావుతో వైసీపీ పేటీఎం బ్యాచ్ డ్రామా చేసిందన్నారు నారా లోకేశ్.
అచ్చారావుతో డ్రామా...
అచ్చారావుతో డ్రామా ఆడించి సోషల్ మీడియాలో వీడియోలో పోస్టు చేశారని నారా లోకేశ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నామని, పవిత్రమైన తిరుమలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పమని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి చెంత రాజకీయాలు చేయడం తగదని సూచించారు.